Motilal Vora: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ వోరా

  • అధ్యక్ష పదవిలో కొనసాగలేనన్న రాహుల్
  • ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వోరా
  • నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకూ పదవిలో వోరా
2019 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే, పార్టీ వర్కింగ్ కమిటీ దానిని తిరస్కరించింది. అయినప్పటికీ, ఇకపై అధ్యక్ష పదవిలో ఏమాత్రం కొనసాగలేనని స్పష్టం చేశారు. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ పార్టీ శ్రేణులకు రాహుల్ నాలుగు పేజీల బహిరంగ లేఖను కూడా రాశారు.

 ఈ నేపథ్యంలో, పార్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ వోరా(90)ను నియమించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వోరా నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యే వరకూ పదవిలో కొనసాగుతారు.
Motilal Vora
Rahul Gandhi
Resign
Chattisgarh
Rajyasabha MP

More Telugu News