Ismart shanker: ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ విడుదల.. ‘ఏ బొమ్మా.. నువ్వు ‘ఊ’ అంటే’ అంటున్న హీరో రామ్

  • ఫైటింగ్ సన్నివేశంతో ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ ప్రారంభం
  • ఈ నెల 18న విడుదల కానున్న చిత్రం
  • రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ హీరో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ ట్రైలర్ విడుదలైంది. ఫైటింగ్ సన్నివేశంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ‘ఏ బొమ్మా  .. నువ్వు ‘ఊ’ అంటే గోల్కొండ రిపేరు జేసి నీ చేతిలో పెడతా. నిన్ను బేగంను చేసి ఖిల్లా మీద కూర్చో పెడతా.. క్యా బోల్తే..ఆ’ అంటూ రామ్ వాయిస్ ఓవర్, ‘ఒరేయ్, వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చ పోయించినా..’ అంటూ నభా నటేశ్ డైలాగ్స్ చెప్పడం గమనించవచ్చు. రాయ రాయె  రాయ రాయె మైసమ్మ, బల్కంపేట ఎల్లమ్మవే, మా తల్లి బంగారు మైసమ్మవే..’ అంటూ సాగే పాటలో రామ్ కనిపిస్తాడు. ఈ నెల 18న విడుదల కానున్న ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ నటిస్తున్నారు.
Ismart shanker
Hero Ram
Puri Jagannadh
Trailer

More Telugu News