అంబటి రాయుడు రిటైర్మెంట్.. సెలెక్టర్లపై నిప్పులు చెరిగిన గౌతం గంభీర్
- రాయుడు గొప్ప ఆటగాడు
- భారత క్రికెట్ కు ఈరోజు ఒక దుర్దినం
- రాయుడి రిటైర్మెంట్ కు సెలెక్టర్లే కారణం
ఈ నేపథ్యంలో సెలెక్టర్లపై టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మండిపడ్డారు. భారత క్రికెట్ కు ఇదొక దురదృష్టకరమైన రోజు అని అన్నారు. భారత్ తరపున రాయుడు ఎంతో అద్భుతంగా రాణించాడని మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేశాడని గుర్తు చేశారు. ఐపీఎల్ లో సత్తా చాటాడని చెప్పారు. అలాంటి నైపుణ్యం ఉన్న ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించడం బాధ కలిగిస్తోందని అన్నారు. సెలెక్షన్ ప్యానల్ లో ఉన్న ఐదుగురు సభ్యులందరినీ కలిపినా... రాయుడు చేసినన్ని పరుగులు చేయలేదని ఎద్దేవా చేశారు. సెలెక్టర్ల తీరు ఎంతో నిరాశను కలిగించిందని వ్యాఖ్యానించారు. రాయుడి రిటైర్మెంట్ కు సెలెక్టర్ల తప్పుడు నిర్ణయాలే కారణమని మండిపడ్డారు.