Andhra Pradesh: రేపటి నుంచి ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు

  • రెండ్రోజుల పాటు జరగనున్న శిక్షణా తరగతులు
  • పలు అంశాలపై అవగాహన కల్పించనున్న నిపుణులు
  • నేటి తరం ఎమ్మెల్యేల పాత్రపై ప్రసంగించనున్న ధర్మాన
ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో రేపటి నుంచి రెండ్రోజుల పాటు శిక్షణా తరగతులు జరగనున్నాయి. అసెంబ్లీ వ్యవహారాలు, ప్రశ్నోత్తరాలు, బడ్జెట్ నిర్వహణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిపుణులు అవగాహన కల్పించనున్నారు. ఈ శిక్షణా తరగతుల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం, సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు.

నేటి తరం ఎమ్మెల్యేల పాత్రపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఉపన్యాసం ఇవ్వనున్నారు. రెండో రోజు నిర్వహించే శిక్షణా తరగతుల్లో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొంటారు. మాజీ సీఎస్ లు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, అసెంబ్లీ సెక్రటరీ లు కూడా ప్రసంగించనున్నట్టు సమాచారం.
Andhra Pradesh
MLA`s
MLC`s
cm
Jagan

More Telugu News