Divya Vani: ప్రతి చోటా కాపలా ఉండలేమని హోంమంత్రే అంటే ప్రజలు ఏమైపోవాలి?: దివ్యవాణి

  • మహిళ హోంమంత్రి అయ్యారన్న ఆనందం ఆవిరైంది
  • బదిలీలపై ఉన్న శ్రద్ధ, ప్రజల భద్రతపై కూడా ఉండాలి
  • చంద్రబాబుకు భద్రత తగ్గించిన విషయం నిజం కాదా?
అధికారుల బదిలీలపై ఉన్న శ్రద్ధ,  ప్రజల భద్రతపై కూడా ఉండాలని టీడీపీ నాయకురాలు దివ్యవాణి అన్నారు. నేడు ఆమె సోషల్ మీడియా వేదికగా, ఏపీ హోంమంత్రి సుచరితపై విమర్శలు గుప్పించారు. ఒక మహిళ హోంమంత్రి అయ్యారన్న ఆనందం నెలలోనే ఆవిరైందని పేర్కొన్నారు. ప్రతి చోటా కాపలా ఉండలేమని, శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రే అంటే, ప్రజలు ఏమైపోవాలని ప్రశ్నించారు. చంద్రబాబుకు భద్రతను తగ్గించిన విషయం నిజం కాదా? అంటూ దివ్యవాణి ఫైర్ అయ్యారు.
Divya Vani
Sucharitha
Chandrababu
Officers Transfers
Home Minister

More Telugu News