ముంబైలో విషాదం.. వరదల్లో చిక్కుకుని ఇద్దరు స్నేహితుల మృతి
- అండర్పాస్లోకి ప్రవేశించిన స్నేహితులు
- ఇంజిన్లోకి నీరు చేరడంతో ఆగిపోయిన కారు
- కారును స్టార్ట్ చేయడంలో నిమగ్నమైన స్నేహితులు
పోలీసుల కథనం ప్రకారం, ఇర్ఫాన్ ఖాన్(37), గుల్షన్ షేక్(38) సోమవారం అర్థరాత్రి తమ ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అండర్పాస్లోకి ప్రవేశించారు. అక్కడ కారు నీటిలో ఇరుక్కుపోవడంతో ఇంజిన్లోకి వరద నీరు ప్రవేశించింది. వెంటనే వారు కారును స్టార్ట్ చేసే ప్రయత్నంలో నిమగ్నమవగా పెద్దగా వరద వచ్చేసి కారును పూర్తిగా చుట్టుముట్టేసింది. దీంతో వారిరువురూ బయటకు రాలేక, ఊపిరాడక కొద్ది సేపటికే ప్రాణాలు విడిచారు.