Kadapa: కడప సౌర విద్యుత్ కేంద్రంలో సౌర ఫలకాల ధ్వంసం

  • 250 మెగావాట్లతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు
  • దుండగుల దాడిలో రూ.3 కోట్ల మేర నష్టం
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
కడప జిల్లాలోని ఓ సౌర విద్యుత్ కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు. మైలవరం మండలం రామచంద్రాయపల్లెలో 250 మెగావాట్లతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటవుతోంది. దీనిపై కన్నేసిన దుండగులు, సౌర విద్యుత్ కేంద్రంలోని 1700 సౌర ఫలకాలను ధ్వంసం చేశారు. దీంతో దాదాపు రూ.3 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు యాజమాన్యం తెలిపింది. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Kadapa
Solar Power Station
Solar Pannels
Police
Ramachandraya Palle

More Telugu News