Gun: ఇంటి బయట తుపాకితో జంటను బెదిరించి.. దోచుకున్న దొంగలు!

  • కారు పార్కింగ్ చేసేందుకు వెళ్లిన వరుణ్
  • నగలతో పాటు పర్స్ కూడా లాక్కొన్న దొంగలు
  • వరుణ్ భార్యపై దాడి చేసి నగలు లాక్కొన్నారు
ఓ జంట హాయిగా విహారానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి కార్ పార్కింగ్ చేస్తుండగా తలపై తుపాకీ గురి పెట్టి మొత్తం నగలను దోచేసిన ఘటన ఉత్తర ఢిల్లీలో జరిగింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో వైరల్ అవుతోంది. వరుణ్ బెహల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి అత్తవారింటికెళ్లి తిరిగి ఇంటికి చేరుకునే సరికి రాత్రయింది. అప్పటికే వరుణ్ ఇంటి వద్ద పొంచి ఉన్న ముగ్గురు దొంగలు కార్ పార్కింగ్ చేసేందుకు వరుణ్ వెళుతుండగా తలపై తుపాకీ గురి పెట్టారు.

ఒంటిపై నగలతో పాటు పర్స్ కూడా లాక్కున్నారు. ఆ తరువాత కారులో ఉన్న వరుణ్ భార్య మీద కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె తన నగలు ఇచ్చేసింది. అయినా ఇంకేమైనా విలువైన వస్తువులున్నాయేమోనని కారంతా వెదికి అక్కడి నుంచి దొంగలు వెళ్లిపోయారు. వెంటనే వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Gun
Thieves
Varun Behal
North Delhi
Car
Police
CC Camera

More Telugu News