Andhra Pradesh: వెంకయ్య నాయుడు ఎప్పుడూ తెలుగువారి శ్రేయస్సునే కోరుకున్నారు!: చంద్రబాబు

  • సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు
  • రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్ఠించారు
  • వెంకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన టీడీపీ అధినేత
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, దేశంలోనే రెండో అత్యున్నత రాజ్యంగ పదవిని అలంకరించారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వెంకయ్య ఎప్పుడూ తెలుగువారి శ్రేయస్సునే కోరుకున్నారని వ్యాఖ్యానించారు. తెలుగుబిడ్డ అయిన వెంకయ్యనాయుడికి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, దేశంలోనే రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన కృషీవలుడు, సదా తెలుగువారి శ్రేయస్సును కోరుకునే స్నేహశీలి, తెలుగుబిడ్డ, ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Venkaiah Naidu
birthday wishes
Chandrababu
Twitter
Telugudesam

More Telugu News