Asifabad: కోనేరు కుటుంబ సభ్యుల నుంచి నాకు ప్రాణహాని ఉంది: ఫారెస్ట్ అధికారి అనిత

  • గతంలో కూడా కోనేరు కృష్ణ నన్ను బెదిరించారు
  • నా కుటుంబానికి రక్షణ కల్పించాలి
  • సారసలలో భూమి అటవీశాఖదే..ఆధారాలు ఉన్నాయి 
అసిఫాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ, వారి అనుచరుల చేతిలో నిన్న దాడికి గురైన ఫారెస్ట్ అధికారి అనిత మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. యూనిఫామ్ ను నమ్ముకునే ఉద్యోగంలోకి వచ్చానని అన్నారు. మహిళా ఉద్యోగులకు రక్షణ లేదని వాపోయారు. సారసల గ్రామంలో భూమి అటవీశాఖదేనన్న ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో కూడా కోనేరు కృష్ణ తనను బెదిరించారని, కోనేరు కుటుంబసభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక కోనేరు అనుచరులు తనను ఏం చేస్తారోనని భయపడుతున్నానని అన్నారు. 
Asifabad
Koneru
Krishna
Forest Ranger
vanita

More Telugu News