Railwaykodur: రైల్వేకోడూరు టెక్కీ హత్యకేసులో ఎట్టకేలకు చిక్కిన కాబోయే భార్య!

  • జూన్ 5న నడిరోడ్డుపై హత్య
  • పెళ్లి ఇష్టంలేక ప్రియుడితో కలిసి ప్లాన్ చేసిన షబ్నా 
  • తాజాగా అరెస్ట్ చేసిన పోలీసులు

కడప జిల్లా రైల్వేకోడూరులో రంజాన్ పండగ కోసం వచ్చిన టెక్కీ అబ్దుల్ ఖాదర్ హత్య కేసులో కీలక నిందితురాలు, ఖాదర్ కాబోయే భార్య షబ్నాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆమెను పట్టణానికి తీసుకువచ్చి మీడియా ముందు నిలిపారు. రాజంపేట డీఎస్పీ మురళీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం, షబ్నాకు అబ్దుల్ ఖాదర్ తో వివాహం నిశ్చయమైంది. అయితే, అప్పటికే ప్రిన్స్ అనే యువకుడితో ప్రేమలో ఉన్న ఆమె, ఖాదర్ తో వివాహం ఇష్టం లేక, సుపారీ ఇచ్చి అతన్ని చంపించింది. పండగకని ఇంటికి వచ్చిన ఖాదర్ ను నడిరోడ్డుపై అడ్డగించి, దారుణంగా హత్య చేయించింది.

కేసు నమోదు చేసిన పోలీసులు  ప్రిన్స్‌ తో పాటు, అతనికి సహకరించిన దీనదయాల్‌ బాబు అలియాస్‌ దీనా, సెల్వందేవ్ ను ఇప్పటికే అరెస్ట్ చేయగా షబ్నాతో పాటు మరో ముగ్గురు నిందితులు మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారు. తాజాగా, వారినీ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. షబ్నాకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అబ్దుల్‌ ఖాదర్‌ తో వివాహాన్ని పెద్దలు నిశ్చయించారని, అతను తనకు వద్దని తన కుటుంబీకులకు, అత్త, మామలకు చెప్పినా వినకపోవడంతోనే హత్యకు ప్లాన్ చేశానని చెప్పింది. ఈ కేసులో నిందితులు అందరినీ అరెస్ట్ చేశామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.

More Telugu News