anand devarakonda: ఆసక్తిని రేపుతోన్న 'దొరసాని' ట్రైలర్

  • 'దొరసాని'గా శివాత్మిక
  •  కూలివాడి కొడుకుగా హీరో
  • ఈ నెల 12వ తేదీన విడుదల
కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో శివాత్మిక - ఆనంద్ దేవరకొండ నాయికా నాయకులుగా 'దొరసాని' రూపొందింది. ఈ ప్రేమకథా చిత్రాన్ని ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

నాయికా నాయకులు ప్రేమలో పడటం .. ఆ ప్రేమను గురించి 'దొరసాని' ఇంట్లో తెలియడం .. కూలివాడి కొడుకుతో ప్రేమ వద్దని దొరసానికి పనోళ్లు చెప్పడం .. దొరసానిని మరిచిపొమ్మని హీరోకి స్నేహితులు చెప్పడం .. ఆ మాటలు వినకపోవడం వలన హీరో చిక్కుల్లో పడటం వంటి సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఆనంద్ దేవరకొండ డైలాగ్ డెలివరీ అచ్చు విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీనే గుర్తుకు తెస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనిపిస్తోంది. తొలి సినిమాతోనే శివాత్మిక .. ఆనంద్ దేవరకొండ హిట్ కొడతారేమో చూడాలి.
anand devarakonda
shivathmika

More Telugu News