India: భారత్-పాక్ లు ఈ ఒక్క విషయంలోనైనా ఏకాభిప్రాయంతో ఉన్నాయి.. సంతోషం!: మెహబూబా ముఫ్తీ

  • ప్రపంచకప్ లో భారత్ గెలవాలని పాక్ ప్రార్థనలు
  • ట్విట్టర్ లో అభినందించిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం
  • ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో భారత్ ఓటమి
వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో నిన్న జరిగిన వన్డేలో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 337 పరుగులు సాధించగా, భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమీకరణాల ప్రకారం పాకిస్థాన్ వరల్డ్ కప్ లో నిలవాలంటే ఇంగ్లాండ్ ఓడిపోవాలి.

దీంతో చాలామంది పాక్ ఫ్యాన్స్ భారత్ గెలవాలంటూ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ..‘పాక్ అభిమానులు ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో భారత్ విజయం కోసం ప్రార్ధిస్తున్నారు. పోనీలెండి. కనీసం క్రికెట్ కారణంగా  అయినా రెండు దేశాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 
India
Pakistan
england
icc world cup2019
Twitter
mehabooba mufti
Jammu And Kashmir

More Telugu News