సాయిరెడ్డి గారూ.. జైలుకు వెళ్లి బెయిల్ పై ఉన్న వ్యక్తులు మారాలి.. క్లీన్ గా ఉన్న నేను కాదు!: కేశినేని నాని కౌంటర్
- కేశినేని మారాలన్న విజయసాయిరెడ్డి
- తాను క్లీన్ గా ఉన్నానని జవాబిచ్చిన కేశినేని
- సీబీఐ, ఈడీ చార్జిషీట్లు ఉన్న వ్యక్తులు మారాలని చురకలు
ఈరోజు ట్విట్టర్ లో కేశినేని నాని స్పందిస్తూ.. ‘విజయసాయిరెడ్డి గారూ.. సీబీఐ, ఈడీ చార్జిషీట్లు ఉన్న వ్యక్తులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లి, బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తులు ముందుగా మారాలి. అంతేతప్ప నాలాంటి నిజాయితీపరులైన వ్యక్తులు మారాల్సిన అవసరం లేదు’ అని చురకలు అంటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీఎం జగన్ తో పాటు విజయసాయిరెడ్డి గతంలో జైలుకు వెళ్లిన విషయాన్ని కేశినేని నాని ఈ మేరకు పరోక్షంగా ప్రస్తావించారు.