Narendra Modi: కేదార్ నాథ్ లో మోదీ మానియా... ధ్యానం చేసిన గుహకు భారీగా డిమాండ్!

  • వచ్చే నెల వరకూ బుకింగ్స్ ఫుల్
  • మోదీ దర్శనం తర్వాత పెరిగిన డిమాండ్
  • అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఖాళీగా లేని వైనం
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ కేదార్ నాథ్ ను దర్శించుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు అక్కడే ఉన్న ఓ గుహలో మోదీ ధాన్యం చేశారు. తాజాగా ఆ గుహకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడింది. మోదీ ధ్యానం చేసిన గుహలోనే ధ్యానం చేయాలని చాలామంది భావించడంతో వచ్చే నెల మొత్తం బుకింగ్స్ ఇప్పటికే అయిపోయాయి. ఇక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో గుహకు సంబంధించిన అడ్వాన్స్ డ్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

ఈ విషయాన్ని గఢ్వాల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌(జీఎంవీఎన్‌) తెలిపింది. మోదీ ఈ గుహను దర్శించుకున్న తర్వాత దీనికి అమాంతం డిమాండ్ పెరిగిపోయిందనీ, అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఈ గుహ ఖాళీగా లేదని పేర్కొంది.
Narendra Modi
BJP
kedarnath
guha
cave
meditation
demand high

More Telugu News