Rahul Gandhi: పాదయాత్ర ద్వారా దేశాటనం చేయాలని రాహుల్ కీలక ఆలోచన!

  • ఎన్నికల్లో ఓటమితో దిక్కుతోచని స్థితి
  • నేతల మూకుమ్మడి రాజీనామాలు
  • ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న రాహుల్
రెండు వరుస ఎన్నికల్లో పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిల్లో పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలను కూడగట్టేందుకు రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అధ్యక్షుడిగా కొనసాగేది లేదని తేల్చి చెప్పిన ఆయన, సీనియర్‌ నేతల మూకుమ్మడి రాజీనామాలు పార్టీలో మరింత సంక్షోభానికి కారణమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని భావిస్తున్న రాహుల్‌ పాదయాత్ర ద్వారా దేశాటన చేయాలని అనుకుంటున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. గతంలో జయప్రకాశ్‌ నారాయణ, వీపీ సింగ్, చంద్రశేఖర్‌ తదితరులు ఇదే తరహాలో దేశాటన చేసి తామనుకున్న లక్ష్యాలను చేరుకున్నారు. ఇప్పుడు తానూ వారి బాటలో నడవాలన్నది రాహుల్ ఆకాంక్షగా తెలుస్తోంది. రాహుల్ పాదయాత్రపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
Rahul Gandhi
Congress
Padayatra

More Telugu News