ఉమా.. జగన్ ను ఏదో అనబోయి ఆగావ్.. చేతబడి ఏమైనా మొదలుపెట్టావా ఏంటి?: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఏపీ సీఎంపై విరుచుకుపడ్డ దేవినేని ఉమ
- కౌంటర్ వేసిన విజయసాయిరెడ్డి
- ఉమ కుటుంబ వ్యవహారాల ప్రస్తావన
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గాలతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ?’ అని ఘాటుగా విమర్శించారు.