Drugs: మాదక ద్రవ్యాలను తరలించేందుకు సహకరించలేదని.. బాలుడి నోట్లో యాసిడ్ పోసిన దుండగులు!

  • పాక్షికంగా మాట కోల్పోయిన బాలుడు
  • ప్రమాదమేమీ లేదన్న వైద్యులు
  • నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాదక ద్రవ్యాలను తరలించేందుకు సహకరించలేదనే కోపంతో బాలుడి నోట్లో యాసిడ్ పోయగా, అతడు పాక్షికంగా మాట కోల్పోయి, ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లక్నోలోని ఫైజుల్లాగంజ్ ప్రాంతానికి చెందిన బాలుడు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతడిని ముగ్గురు వ్యక్తులు మాదక ద్రవ్యాల తరలింపునకు సహకరించాలని కోరారు. కాగా ఆ బాలుడు దానికి నిరాకరించడంతో బాలుడి నోట్లో యాసిడ్ పోశారు.

బాధతో విలవిల్లాడుతూ బాలుడు ఇంటికి చేరుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశాడు. వెంటనే తల్లిదండ్రులు తమ కుమారుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడికి ప్రమాదమేమీ లేదని కానీ స్వరపేటికకు ఏమైనా నష్టం వాటిల్లిందా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రస్తుతం బాలుడు పాక్షికంగా మాట కోల్పోయాడు. నిందితుల ఆనవాళ్లను తెలుసుకున్న పోలీసులు నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Drugs
Noor
Lucknow
Acid
Hospital
Minor Boy

More Telugu News