Jersey: టీమిండియా కొత్త జెర్సీలు వచ్చేశాయ్!

  • కొత్త జెర్సీలు విదేశీ పర్యటనల కోసమే!
  • ఆరెంజ్ కలర్ జెర్సీలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన బీసీసీఐ
  • సొంతగడ్డపై బ్లూ జెర్సీలు!
టీమిండియాకు మరో పేరు మెన్ ఇన్ బ్లూ! పరిమిత ఓవర్ల క్రికెట్ లో బ్లూ కలర్ జెర్సీల్లో కనిపించే భారత ఆటగాళ్లను మరో రంగు దుస్తుల్లో ఊహించుకోవడం కష్టమే. అయితే, ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు తొలిసారి సరికొత్త జెర్సీలతో కనువిందు చేసే అవకాశాలున్నాయి ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లు కాషాయరంగు జెర్సీలు ధరించనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆటగాళ్ల కొత్త జెర్సీల నమూనాలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టీమిండియా విదేశీ పర్యటనల జెర్సీ ఇదేనంటూ పేర్కొంది. బీసీసీఐ పేర్కొంటున్న దాన్నిబట్టి ఇకనుంచి టీమిండియా సొంతగడ్డపై బ్లూ కలర్ జెర్సీలు, విదేశాల్లో కాషాయజెర్సీలతో మ్యాచ్ లు ఆడనుందని తెలుస్తోంది.
Jersey
BCCI
Team India
Cricket

More Telugu News