సూర్య యాక్షన్ సినిమాకి టైటిల్ ఖరారు
- సూర్య హీరోగా రూపొందిన 'కాప్పన్'
- తెలుగు టైటిల్ గా 'బందో బస్త్'
- ఆగస్టు 30వ తేదీన విడుదల
సూర్య తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తుంటారు. అలాగే 'కాప్పన్' సినిమాను కూడా తెలుగులో అదే రోజున విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి తెలుగులో 'బందో బస్త్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. స్పెషల్ కమాండో ఆఫీసర్ గా సూర్య కనిపించే ఈ సినిమాలో, బొమన్ ఇరాని .. సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో కార్తీ మెరవనుండటం విశేషం. హారీస్ జైరాజ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.