amaravathi: రూ.2 వేల కోట్లతో అమరావతి స్మార్ట్‌ సిటీ పనులు: కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌

  • ఏపీ ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించినట్లు తెలిపిన మంత్రి
  • రూ.500 కోట్లు ఇచ్చేందుకు కూడా అంగీకరించినట్లు వెల్లడి
  • ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం
అమరావతిలో స్మార్ట్‌ సిటీ పనులు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం రూ.2,046 కోట్లతో ప్రతిపాదనలు పంపించిందని, వాటికి అంగీకారం తెలిపినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ తెలిపారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో నిన్న అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. మొత్తం వ్యయంలో కేంద్రం రూ.500 కోట్లు అందజేస్తుందని, రాష్ట్రం మరో రూ.500 కోట్లు ఖర్చు చేయాలని సూచించారు. మిగిలిన నిధులను స్మార్ట్‌సిటీ స్పెషల్‌ పర్సస్‌ వెహికిల్‌ ద్వారా సమకూర్చుకోవాలని సూచించినట్లు తెలిపారు. కేంద్రం తరపున ఇప్పటి వరకు రూ.390 కోట్లు విడుదల చేసినట్లు తెలియజేశారు.
amaravathi
smartcity
central approval
2000 crores

More Telugu News