Andhra Pradesh: ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ!

  • చంద్రబాబు ప్రసంగంపై బుగ్గన సెటైర్లు
  • ట్విట్టర్ లో ప్రసంగాన్ని పోస్ట్ చేసిన వర్మ
  • ఇలాంటి 5-10 మంది ఉంటే చాలని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి విరుచుకుపడ్డారు. వైసీపీ నేత, ఏపీ ఆర్థిక, ప్రణాళిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గతంలో చంద్రబాబు ఇంగ్లిష్ పై చేసిన విమర్శలను ప్రస్తావించారు. ‘వైసీపీకి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తన ప్రసంగంలో చంద్రబాబును ఎక్స్ పోజ్ చేసేశాడు. ఇలాంటి ఓ 5-10 మంది వైసీపీలో ఉంటే సీఎం జగన్ బలం అమాంతం పెరిగిపోతుంది’ అని రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Telugudesam
buggana
Chandrababu
Twitter
RGV

More Telugu News