టీడీపీ మంత్రుల వద్ద పనిచేసిన వారు మనకు వద్దు: సీఎం జగన్ ఆదేశం
- పీఎస్, పీఏ, ఓఎస్డీలుగా కొత్తవారినే తీసుకోండి
- ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరించాలి
- ముఖ్య సలహాదారు అజేయ కల్లంకు ముఖ్యమంత్రి సూచన
తాజాగా ప్రభుత్వం మారి కొత్త మంత్రులు రావడంతో వీరంతా తిరిగి అవే పోస్టుల్లో కొనసాగేందుకు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే అప్పటి మంత్రుల వద్ద పనిచేసిన వారెవరినీ తీసుకోవద్దని, ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ ముఖ్య సలహాదారు అజేయ కల్లంకు సూచించడంతో వీరి ప్రయత్నాలకు బ్రేక్ పడినట్టే. సిబ్బంది నియామకాల్లో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.