Brian Lara: ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన బ్రియాన్ లారా

  • ముంబయిలో ఛాతీ నొప్పితో బాధపడిన లారా
  • హుటాహుటీన ఆసుపత్రికి తరలింపు
  • తన ఆరోగ్యంపై అభిమానుల కోసం లారా వాయిస్ మెసేజ్
కరీబియన్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. ఈ మేరకు ముంబయిలోని గ్లోబల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. వరల్డ్ కప్ కార్యక్రమాల కోసం ఓ చానల్ తో ఒప్పందం కుదుర్చుకున్న లారా ముంబయిలో ఉండగా ఛాతీనొప్పికి గురయ్యాడు. దాంతో ఆయన్ను వెంటనే గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం లారా క్రమంగా మామూలు స్థితికి చేరుకున్నాడు. తాను క్షేమంగానే ఉన్నానంటూ అభిమానులను ఉద్దేశించి వాయిస్ మెసేజ్ విడుదల చేశాడు.

Brian Lara
Cricket
Mumbai
World Cup

More Telugu News