VV Vinayak: వట్టినాగులపల్లిలో వీవీ వినాయక్ కు చెందిన భవనం కూల్చివేత

  • దర్శకుడి భవనం నిబంధనలకు వ్యతిరేకం అంటున్న జీహెచ్ఎంసీ
  • ఆ మేరకు నోటీసులు
  • నోటీసులకు స్పందించని వీవీ వినాయక్
టాలీవుడ్ దర్శకుడు వీవీ వినాయక్ కు చెందిన ఓ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన వట్టినాగులపల్లిలో వినాయక్ కొంతకాలంగా నాలుగు అంతస్తుల భవంతి నిర్మిస్తున్నారు. అయితే, దీనికి సరైన అనుమతులు లేవంటూ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీచేశారు. 111 జీవోకు వ్యతిరేకంగా నిర్మాణం ఉందంటూ నోటీసుల్లో తెలిపారు. అయితే, దర్శకుడు వినాయక్ నుంచి నోటీసులకు స్పందన లేకపోవడంతో అధికారులు రంగంలోకి దిగి వట్టినాగులపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారు.
VV Vinayak
Hyderabad
GHMC

More Telugu News