Andhra Pradesh: టీడీపీ నేతలు చంద్రబాబు భజన చేయడం మానుకోవాలి.. లేదంటే ప్రజలు క్షమించరు!: సీనియర్ నేత తోట త్రిమూర్తులు

  • బాబు మెప్పు కోసమే బుద్ధా ఆందోళన
  • ప్రజావేదికపై ఆందోళన చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి
  • అన్ని అక్రమ కట్టడాలపైనా జగన్ ఇలాగే స్పందించాలి
  • అమరావతిలో మీడియాతో టీడీపీ సీనియర్ నేత
అమరావతిలోని ప్రజావేదిక కూల్చివేతను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులు సొంత పార్టీ నేతల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసమే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆందోళనకు దిగారని ఆయన విమర్శించారు. ఇకనైనా పార్టీ అధినేతకు భజన చేయడాన్ని టీడీపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు.

ఇప్పటికైనా టీడీపీ నేతలు మారకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. టీడీపీ నేతలు ప్రజావేదిక విషయంలో ఆందోళన నిర్వహిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతాయని ఆయన తెలిపారు. కరకట్టపై ఉన్న ఇతర అక్రమ నిర్మాణాల విషయంలో కూడా సీఎం జగన్ ఇలాగే స్పందించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై చెబుతారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
Andhra Pradesh
Telugudesam
Chandrababu
budha venkanna
tota trimurtulu

More Telugu News