pawan kalyan: పవన్ కల్యాణ్ కార్యక్రమంలో జేబు దొంగల చేతివాటం

  • నంబూరు దశావతార వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న పవన్
  • ఆలయం వద్ద జేబు దొంగల హల్ చల్
  • ఆలయ నిర్వాహకుడి రూ. 25 వేలు మాయం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న దశావతార వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వస్తున్నారన్న సమాచారంతో అక్కడకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ఇదే అదనుగా జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పలువురి జేబులను ఖాళీ చేశారు. ఇదే సమయంలో ఆలయ నిర్వాహకుడి జేబులో ఉన్న రూ. 25 వేలను కూడా కొట్టేశారు.
pawan kalyan
thieves
janasena

More Telugu News