ఏఎన్నార్ సాంఘిక చిత్రాలకి పనికిరాడనుకున్నారు: సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి

  • జానపదాలు చేసిన అక్కినేని
  • క్రేజ్ తెచ్చిపెట్టిన 'బాలరాజు'
  • 'సంసారం'తో విమర్శలు తిప్పికొట్టారన్న గుడిపూడి 
తాజా ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రస్తావించారు."అక్కినేని నాగేశ్వరరావుగారికి మంచి నాటకానుభవం వుంది. నటనపట్ల ఆసక్తితోనే ఆయన సినిమా పరిశ్రమకి వచ్చారు. 'బాలరాజు' .. 'కీలుగుఱ్ఱం' వంటి సినిమాలు ఆయనకి మంచిపేరు తెచ్చిపెట్టాయి.

దాంతో జానపద చిత్రాలకి మాత్రమే అక్కినేని పనికి వస్తారనీ, సాంఘిక చిత్రాలకి ఆయన పనికిరాడనే టాక్ వచ్చింది. దర్శక నిర్మాతలు అదే అభిప్రాయంతో ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి 'సంసారం' అనే సాంఘిక చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో అక్కినేని నటనకి ప్రశంసల వర్షం కురిసింది. అక్కినేని సాంఘిక చిత్రాలు కూడా అద్భుతంగా చేయగలడు అనే నమ్మకం అందరిలోను కలిగింది. ఆ సినిమా అక్కినేనిని ఒక్కోమెట్టు ఎక్కిస్తూ వెళ్లింది" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
gudipudi srihari

More Telugu News