Kanna Lakshminarayana: కన్నా సమక్షంలో బీజేపీలో చేరిన వైసీపీ నేతలు

  • మోదీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు
  • అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యం
  • అన్ని పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖం
  ఏపీ అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రజలు నమ్ముతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. నేడు వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు కాసు విజయభాస్కరరెడ్డి, వజ్ర భాస్కరరెడ్డి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ, అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు.
Kanna Lakshminarayana
Narendra modi
YSRCP
Vijaya Bhaskar Reddy
Vajra Bhaskara Reddy

More Telugu News