T-congress: వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ చచ్చిపోయింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • ఆ పార్టీలో ఉత్తమ్ తప్ప మరెవ్వరూ ఉండరు
  • మరో ఇరవై ఏళ్లయినా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు
  • టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే 
కాంగ్రెస్ పార్టీని మరో పదిరోజుల్లో వీడనున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటిలేటర్ పై ఉన్న ‘కాంగ్రెస్’ చచ్చిపోయిందని, ఆ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప మరెవ్వరూ ఉండరని అన్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకపోవడమే కాంగ్రెస్ ఓటమికి కారణమని ఆరోపించారు.

అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, రెండుసార్లు గెలిపించిన ప్రజలకు తాను న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో ఇరవై ఏళ్లు అధికారంలోకి రావడం కల్లేనని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. తెలంగాణలో బీజేపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదాను కాపాడుకోలేని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు నోటీసులు ఇవ్వడమేంటని సెటైర్లు విసిరారు.
T-congress
Komati reddy
rajagopal reddy
BJP

More Telugu News