గ్రామ వాలంటీర్లకు ప్రారంభంలోనే తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన జగన్
- 1,70,543 గ్రామ వాలంటీర్ల కోసం నోటిఫికేషన్ జారీ
- అవినీతికి తావు లేకుండా పనిచేయాలన్న సీఎం
- తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్
ఈ నేపథ్యంలో, గ్రామ వాలంటీర్లు ఇంకా ఎంపిక కాకముందే... వారికి ముఖ్యమంత్రి జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవినీతి లేకుండా చేసేందుకే ఒక్కో గ్రామ వాలంటీర్ కు నెలకు రూ. 5 వేల వేతనాన్ని చెల్లించబోతున్నామని... అవినీతికి తావు లేకుండా పని చేయాలని చెప్పారు. గ్రామ వాలంటీర్ తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రభుత్వ పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేస్తున్నామని జగన్ చెప్పారు. ప్రభుత్వ పథకాలను గ్రామ వాలంటీర్ల ద్వారా అమలు చేస్తామని తెలిపారు.