central: కేంద్ర హోం శాఖలోని అంతర్గత శాఖను నాకే అప్పగించారు: సహాయ మంత్రి కిషన్ రెడ్డి

  • ఉగ్రవాద నిరోధక చర్యల విభాగం, జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలను కూడా
  • ఆయా ప్రాంతాల్లోని ఉగ్రవాద ముఠాలపై సమీక్షిస్తాం
  • పోలీసు విభాగాలకు సాంకేతిక సాయం పెంచుతాం
కేంద్ర హోం శాఖలోని కొన్ని అంతర్గత శాఖలను తనకే అప్పగించారని ఆ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాద నిరోధక చర్యల విభాగాన్ని, జమ్ముకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల బాధ్యతలను ప్రభుత్వం తనకే అప్పగించిందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని ఉగ్రవాద ముఠాలపై, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని శాంతిభద్రతలపై త్వరలోనే సమీక్షిస్తామని అన్నారు. పోలీసు శాఖను ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని, విదేశాల్లో ఉన్న విధానాలు తెలుసుకుని పోలీసు శాఖను ఆధునికీకరిస్తామని, పోలీసు విభాగాలకు సాంకేతిక సాయం పెంచుతామని స్పష్టం చేశారు.
central
minister
kishan reddy
jamm kashmir

More Telugu News