Prakasam: ఒంగోలులో గ్యాంగ్ రేప్ నిందితులను శిక్షిస్తాం: ఏపీ డీజీపీ సవాంగ్

  • మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యత ఇస్తాం
  • నిందితులను ఇరవై నాల్గు గంటల్లోనే పట్టుకున్నారు
  • ఎస్పీ, పోలీస్ సిబ్బందికి అభినందనలు చెప్పిన సవాంగ్
ప్రకాశం జిల్లా ఒంగోలులో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని అన్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోపే స్పందించి, నిందితులను అరెస్టు చేసిన పోలీసులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
Prakasam
Ongole
Gang rape
AP
DGP

More Telugu News