టెలీకాన్ఫరెన్స్ చివర్లో వచ్చిన గంటా శ్రీనివాసరావు... వ్యక్తిగతంగా మాట్లాడతానంటూ చంద్రబాబుతో చెప్పిన వైనం

షార్ట్స్‌లో చూడండి
టీడీపీలో ఏర్పడిన కల్లోలం తాలూకు ప్రకంపనలు ఇంకా ముగియలేదు. తాజా పరిస్థితిపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించగా, నేతలు ఆయా పరిణామాలను చంద్రబాబుకు వివరించారు. ఇక, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశం చివర్లో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వచ్చిన వెంటనే తాజా పరిణామాలను చంద్రబాబుకు వివరించిన ఆయన, ఆ తర్వాత కొన్ని ఇతర విషయాలను మీతో వ్యక్తిగతంగానే మాట్లాడతానంటూ అధినేతతో చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో, గంటా శ్రీనివాసరావు కూడా పార్టీకి గుడ్ బై చెబుతారంటూ వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ పేర్కొనడం కలకలం రేపుతోంది.
Go Back to Shorts
Chandrababu
Ganta Srinivasa Rao
Telugudesam

More Telugu News