Andhra Pradesh: ప్రాణాలయినా త్యాగం చేస్తాం.. టీడీపీని కాపాడుకుంటాం!: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

  • విజయసాయిరెడ్డి బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారు
  • బీజేపీ నియంత తరహాలో పాలన సాగిస్తోంది
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
బీజేపీ దేశంలో నియంతలా పరిపాలన సాగిస్తోందని టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ప్రాంతీయ పార్టీలను తుదముట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న మోసపూరిత కుట్రలను ప్రజలకు తెలియజేస్తామని ప్రకటించారు. గుంటూరు జిల్లా అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు.

అవసరమైతే ప్రాణత్యాగం చేసి అయినా టీడీపీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుల ఫిరాయింపు వ్యవహారంలో వైసీపీ నేత విజయసాయిరెడ్డి బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికే వీలులేదన్న జగన్.. అదే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి  ఎలా హాజరయ్యారని నిలదీశారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
BJP
Kollu Ravindra
angry
Guntur District
amaravati

More Telugu News