Andhra Pradesh: తెలంగాణ టీడీపీ నేత మహమూద్ ఆకస్మిక మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధినేత చంద్రబాబు!
- మహమూద్ అంకితభావంతో నిస్వార్థంగా సేవలందించారు
- మైనారిటీల అభ్యున్నతి కోసం కృషి చేశారు
- ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా
తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మొహమ్మద్ మహమూద్ మరణించారు. ఈయన మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహమూద్ అంకితభావంతో, నిస్వార్థంగా పార్టీకి సేవలు అందించారని ప్రశంసించారు. ఈ రోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ.. ‘తెలంగాణ టీడీపీ నేత మహమూద్ ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా.
ఆయన పార్టీ కోసం అంకితభావంతో, నిస్వార్థంగా పనిచేశారు. మైనారిటీల అభ్యున్నతి కోసం కృషి చేశారు. ప్రజాసేవకుడు ఎలా ఉండాలన్న దానిపై భావి తరాలకు ఆదర్శంగా నిలిచారు. ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుతున్నా. మహమూద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.