ప్రేమికులపై దాడి.. యువతిపై సామూహిక అత్యాచారం
- తమిళనాడులోని విళుప్పురంలో ఘటన
- ప్రియుడి కళ్లముందే దారుణం
- నిందితుల్లో ఒకరి అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు
అక్కడకు సమీపంలోనే మద్యం తాగుతున్న నలుగురు వ్యక్తులు వీరిని చూసి దగ్గరికి వచ్చారు. దీంతో భయపడిన జంట అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. అయితే, అప్పటికే వారిని చుట్టుముట్టిన దుండగులు యువకుడిని తీవ్రంగా కొట్టి అతడి కళ్లముందే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దుండగుల బారి నుంచి తప్పించుకున్న యువకుడు ఫోన్లో తన స్నేహితుడికి సమాచారం ఇవ్వగా అతడొచ్చాడు. దీంతో ఇద్దరూ కలిసి దుండగులతో పోరాడారు. వారిని కూడా చితకబాదిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహ తప్పి పడిపోయిన యువతిని స్థానికుల సహాయంతో యువకులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకడైన అయ్యనార్ (27)ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.