meesala geetha: కాకినాడ సమావేశానికి హాజరైన మాట నిజమే.. పార్టీ మారను: మీసాల గీత

  • కొందరు టీడీపీ నేతలే ఈ ప్రచారం చేస్తున్నారు
  • తన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు
  • టీడీపీ ఓటమిపై మేమంతా చర్చించాం
టీడీపీకి చెందిన కాపు నేతలు కాకినాడలో నిర్వహించిన సమావేశం ఆ పార్టీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీరంతా టీడీపీని వీడబోతున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఇదే విషయంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్పందించారు. కాకినాడ సమావేశానికి తాను హాజరైన మాట నిజమేనని అన్నారు. కానీ, పార్టీ మాత్రం మారబోనని ఆమె చెప్పారు. తానంటే గిట్టని కొందరు టీడీపీ నేతలే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. కాకినాడ సమావేశానికి విజయనగరం జిల్లా నుంచి తనతో పాటు మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు కూడా హాజరయ్యారని చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిపై తామంతా చర్చించామని తెలిపారు.
meesala geetha
Telugudesam
kakinada
meeting

More Telugu News