దర్గాకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
- ఎనిమిది మందితో వెళుతున్న ఆటోను ఢీకొట్టిన లారీ
- చిల్కూరు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఘటన
- మృతులంతా మహబూబాబాద్ జిల్లా వాసులు
దర్గాలో ప్రార్థనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆటోలో వస్తుండగా చిల్కూరు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దగ్గరలోని స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.