Jagan: మేడిగడ్డకు బయలుదేరిన వైఎస్ జగన్!

  • ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రయాణం
  • నేడు కాళేశ్వరం ప్రారంభం
  • పాల్గొననున్న జగన్, ఫడ్నవీస్
నేడు జరగనున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డకు ఆయన బయలుదేరారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ భూపాలపల్లికి చేరుకున్నారు. మరికాసేపట్లో మేడిగడ్డ వద్దకు ఆయన వెళ్లనున్నారు. ఆపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సైతం అక్కడికి చేరుకోనుండగా, కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తరువాత, కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలోనూ వైఎస్ జగన్ పాల్గొంటారు. మధ్యాహ్న భోజన అనంతరం జగన్ తిరిగి అమరావతికి బయలుదేరుతారు.
Jagan
Kaleshwaram
KCR
Medigadda

More Telugu News