Telugudesam: జగన్ పొర్లుదండాలు పెట్టినా ‘ప్రత్యేక హోదా’ రాదు: టీడీపీ ఎంపీ కేశినేని నాని

  • ‘హోదా‘ కోసం మా హయాంలో పోరాడి విఫలమయ్యాం
  • బీజేపీ అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా రాదు
  • నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు
ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారో సీఎం జగన్ చెప్పాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని కోరారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా ఏపీకి ప్రత్యేక హోదా రావడం జరగదని అన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్ హామీని నమ్మి ఎన్నికల్లో ఆయనను గెలిపించారని, ఆ హామీ ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని కోరారు.

‘హోదా‘ కోసం తమ హయాంలో కేంద్రంపై అన్ని విధాలా పోరాడి విఫలమయ్యామని అన్నారు. జగన్ పొర్లుదండాలు పెట్టి, తలకిందులా తపస్సు చేసినా కూడా ప్రత్యేక హోదా ఇవ్వరని ధీమాగా చెప్పారు. తాను ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని అని, తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎక్కడికైనా వెళతానని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం అవసరమైతే సీఎం జగన్ ని, ప్రధానిని, మంత్రులను కలుస్తానని కేశినేని నాని పేర్కొన్నారు.
Telugudesam
Kesineni Nani
YSRCP
cm
jagan

More Telugu News