Bangladesh: భారీ లక్ష్యఛేదనలో కీలక వికెట్లు చేజార్చుకున్న బంగ్లాదేశ్

  • బంగ్లా టార్గెట్ 382 రన్స్
  • ప్రస్తుతం 31 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు
  • క్రీజులో రహీం, మహ్మదుల్లా
ఆస్ట్రేలియా విసిరిన 382 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. 31 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. భారీ హిట్టర్లుగా పేరుగాంచిన తమీమ్ ఇక్బాల్ (62), సౌమ్య సర్కార్ (10), షకీబల్ హసన్ (41), లిట్టన్ దాస్ (20) పెవిలియన్ చేరడంతో బంగ్లా ఆశలు సన్నగిల్లాయి. అయితే, సీనియర్ బ్యాట్స్ మన్ ముష్ఫికర్ రహీం క్రీజులో ఉండడంతో బంగ్లా అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం రహీమ్ 37, మహ్మదుల్లా 2 పరుగులతో ఆడుతున్నారు. బంగ్లా గెలవాలంటే 19 ఓవర్లలో 202 పరుగులు చేయాలి.
Bangladesh
Australia
World Cup

More Telugu News