Chandrababu: చంద్రబాబుకు తెలియకుండా వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

  • సొంత ప్రయోజనాల కోసమే వారు బీజేపీలో చేరారు
  • న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటాం
  • పార్లమెంటులో ప్రజల గొంతుకను వినిపిస్తాం
టీడీపీ ఎంపీలు తమ సొంత ప్రయోజనాల కోసమే బీజేపీలో చేరారని తెలుగుదేశం పార్టీ ఎంపీలు విమర్శించారు. ఢిల్లీలో నిర్వహించిన టీడీపీ ఎంపీల సమావేశంలో కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ, రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ నలుగురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా వారు ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయమై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయని, పార్లమెంటులో ప్రజల గొంతుకను వినిపిస్తామని చెప్పారు.
Chandrababu
Telugudesam
galla
kanamedala
kesineni

More Telugu News