Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను ఓడించడానికి రూ.150 కోట్లు కాదు, అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు: నాగబాబు
- పవన్ ఓటమి దారుణం
- అధికార దుర్వినియోగం జరిగింది
- ధనప్రవాహం చోటుచేసుకుంది
మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలి ఎన్నికలపై స్పందించారు. నాగబాబు లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక రెండుస్థానాల్లో పోటీచేసి పరాజయం చవిచూశారు.
దీనిపై నాగబాబు తన అభిప్రాయాలు వెల్లడించారు. పవన్ కల్యాణ్ రెండుచోట్ల ఓడిపోవడం అనేది దారుణం అని అన్నారు. పవన్ ను ఓడించడానికి రూ.150 కోట్ల కంటే ఎక్కువే ఖర్చు చేసుంటారని వ్యాఖ్యానించారు. పవన్ రూ.150 కోట్లని చెప్పాడు కానీ, అంతకంటే ఎక్కువే ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ధనప్రవాహంతో పాటు అధికార దుర్వినియోగం కూడా చోటుచేసుకుందని ఆరోపించారు.