భీకర ఫామ్ కొనసాగిస్తున్న వార్నర్... ఖాతాలో మరో శతకం
- ఈ వరల్డ్ కప్ లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్న ఆసీస్ ఓపెనర్
- బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో భారీ స్కోరు దిశగా ఆసీస్
- 38 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 230 పరుగుల స్కోరు
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా, నాటింగ్ హామ్ పిచ్ పై ఎలాంటి తడబాటు లేకుండా ఆడిన వార్నర్ 110 బంతుల్లో 100 పరుగులు నమోదు చేశాడు. అంతకుముందు, కెప్టెన్ ఆరోన్ ఫించ్ ధాటిగా ఆడి 53 పరుగులు చేశాడు. ప్రసుత్తం వార్నర్ 119, ఉస్మాన్ ఖవాజా 50 పరుగులతో ఆడుతున్నారు. 38 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 1 వికెట్ నష్టానికి 230 పరుగులు చేసింది.