Andhra Pradesh: మేం ఎవ్వరినీ ఆకర్షించడం లేదు.. ఇతర పార్టీల ఎంపీలే మా పార్టీలోకి వస్తున్నారు!: బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు

  • మోదీ ఆదరణతో నేతలు బీజేపీవైపు చూస్తున్నారు
  • పార్టీలోకి వచ్చేవారిని సాదరంగా ఆహ్వానిస్తాం
  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు
బీజేపీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నేతలను తాము ఆహ్వానించామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ రావు బీజేపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు మోదీ ఆదరణ చూసి బీజేపీలో చేరేందుకు వస్తున్నారని చెప్పారు.

బీజేపీలో చేరేందుకు వచ్చే నేతలను సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. మోదీ చరిష్మా కారణంగానే ఇతర పార్టీల నేతలు, పార్లమెంటు సభ్యులు బీజేపీవైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. తాము ఏ పార్టీ నేతలనూ ఆకర్షించడం లేదని తేల్చిచెప్పారు. తాజాగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపడం తమ పార్టీ ఏపీలో బలపడుతుందని చెప్పడానికి నిదర్శమని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
BJP
gvl

More Telugu News