Australia: భారీస్కోరుపై కన్నేసిన ఆస్ట్రేలియా... నిలకడగా ఆడుతున్న వార్నర్, ఫించ్

  • ఆసీస్ కు శుభారంభం
  • వార్నర్ అర్ధసెంచరీ
  • బంగ్లాదేశ్ తో మ్యాచ్
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో నేడు నాటింగ్ హామ్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు ఉరికిస్తున్నారు. ప్రస్తుతం వార్నర్ 53, ఫించ్ 43 పరుగులతో ఆడుతున్నారు. దాంతో ఆసీస్ 16.4 ఓవర్లలో 100 పరుగుల మార్కు అందుకుంది. కంగారూల బ్యాటింగ్ ప్లాన్ చూస్తుంటే, మొదట వికెట్లు కాపాడుకుని ఆపై బ్యాట్లు ఝుళిపించాలని భావిస్తున్నట్టు అర్థమవుతోంది.
Australia
Bangladesh
Cricket
World Cup

More Telugu News