Andhra Pradesh: చంద్రబాబుకు భారీ షాక్.. బీజేపీలో చేరనున్న సీఎం రమేశ్, సుజనా, గరికపాటి, టీజీ వెంకటేశ్?

  • ఇప్పటికే అమిత్ షా, మోదీతో భేటీ
  • ఈరోజు సాయంత్రం వెంకయ్యనాయుడితో సమావేశం
  • తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరనున్న సభ్యులు
తెలంగాణలో కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసిన బీజేపీ ఇప్పుడు ఏపీపై దృష్టి సారించిందా? ఏపీలో తెలుగుదేశం పార్టీలో గట్టి నేతలను లాక్కునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందా? అంటే రాజకీయ వర్గాలు అవుననే జవాబు చెబుతున్నాయి. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయిన సుజనా చౌదరి, సీఎం రమేశ్ , గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్  పార్టీకి రాజీనామా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.  

ఇప్పటికే ఈ విషయమై నలుగురు నేతలు బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోదీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిని కలిసి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని ఈ నలుగురు సభ్యులు కోరనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాగా, మిగిలిన ఇద్దరు సభ్యులు తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్ ను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధినేత అమిత్ షా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని వెల్లడించాయి. ఈ బాధ్యతలను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అప్పగించినట్లు పేర్కొన్నాయి.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
4 mps
rajyasabha
joining bjp
Venkaiah Naidu

More Telugu News