kalyan ram: కొత్త సినిమాను మొదలెట్టేసిన కల్యాణ్ రామ్

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల కాలంలో కల్యాణ్ రామ్ కథల విషయంలో కొత్తదనం వైపు  మొగ్గుచూపుతున్నాడు. ఇటీవల వచ్చిన సినిమాలను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాజాగా ఆయన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడానికి రంగంలోకి దిగేశాడు. కెరియర్ పరంగా ఆయనకి ఇది 17వ సినిమా.

'శతమానం భవతి' .. 'శ్రీనివాస కల్యాణం' వంటి కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన సతీశ్ వేగేశ్న, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. మెహ్రీన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమా, కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తొలిసారిగా చేస్తోన్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. 
Go Back to Shorts
kalyan ram
mehreen

More Telugu News