ఆ రెండు కేసుల్లో ముస్లిం నిందితులను వదిలిపెట్టొద్దు!: మమతకు ముస్లింల లేఖ
- వైద్యులపై దాడి, మాజీ మిస్ ఇండియా యూనివర్స్పై దాడి కేసుల్లో ముస్లింలపై ఆరోపణలు
- వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముస్లింల లేఖ
- వారిని శిక్షించడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న అపవాదును కడిగేసుకోవాలని సూచన
‘‘దశాబ్దాల తరబడి మేం ఇక్కడే జీవిస్తున్నాం. ఇటీవల జరిగిన ఈ రెండు ఘటనలు మమ్మల్ని చాలా బాధించాయి. వైద్యులపైనా, నటి ఉషోషీపైనా జరిగిన దాడి బాధాకరం. ఈ రెండు ఘటనల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మా మతానికి చెందినవారే. ఈ ఘటనలకు చాలా చింతిస్తున్నాం. నిందితులపై చర్యలు తీసుకోవడం ద్వారా మీ ప్రభుత్వంపై ఉన్న మచ్చను చెరిపేసుకోండి’’ అని కోల్కతా ముస్లింలు తమ లేఖలో పేర్కొన్నారు. వారు ముస్లింలన్న కారణంతో విడిచిపెట్టవద్దని, ఫలితంగా ఒక్క మతానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్న అపవాదును తొలగించుకోవాలని కోరారు.